– భయాందోళనలో కాలనీవాసులు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో మొసళ్ళు కలకలం రేపింది. నిత్యం రోడ్లపైకి రావడంతో అటుగా వెళ్ళే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎస్సీ కాలనీ అంచన ఉన్న కుంటలో ఏడాది క్రితం ఒక మొసలి చొరబడగా ఇప్పుడు దానితోపాటు మరో రెండు మొసళ్ళు తోడయ్యాయి.
తీవ్రంగా సంచరిస్తూ ఒడ్డుకు వస్తుండడంతో అటుగా వెళ్ళే ప్రజలు కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పురుషులు బహిర్భూమికి వెళ్ళే దారిలో మొసళ్ళు సంచరిస్తుండడంతో తీవ్ర కలకలం రేపింది. సోమవారం 6 అడుగులకు పైగా ఉన్న మొసలి చేపను పట్టిన దృశ్యాలు అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.



