Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగిసిన కాలభైరవుడి ఉత్సవాలు 

ముగిసిన కాలభైరవుడి ఉత్సవాలు 

- Advertisement -

అంగరంగ వైభవంగా రథోత్సవం, అగ్నిగుండాలు
పాల్గొన్న ఎమ్మెల్యే మదన్మోహన్రావు 
నవతెలంగాణ-రామారెడ్డి

మండలంలోని ఇసన్నపల్లి (రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజులపాటు ఘనంగా నిర్వహించారు. చివరి 5వ రోజు బుధవారం ఇరు గ్రామాల ప్రధాన వీధుల గూడ స్వామి వారిని రథోత్సవంలో ఘనంగా ఊరేగించారు. అనంతరం అగ్నిగుండాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్రావు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, పూజారీలు శ్రీనివాస్ శర్మ, వంశీ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -