విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
నవతెలంగాణ – మిర్యాలగూడ
గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధిస్తే లక్ష రూపాయల డొనేషన్ ఇస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని శ్రీనివాస్ నగర్ లో జరుగుతున్న జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ముగింపులో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు విద్యార్థులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకొని బహుమతులు అందజేశారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులలో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య కు ప్రాధాన్యతనిస్తూ విద్యా విధానాన్ని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు అందరూ ధృడమైన సంకల్పంతో మంచిగా చదువుకొని మీ కుటుంబాలకు, మిర్యాలగూడ కు పేరు ప్రఖ్యాతలు తెలుకొని రావాలని కోరారు.
రాష్ట్రస్థాయి ర్యాంకు సాధిస్తే రూ. లక్ష డొనేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


