నవతెంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సూత్రధారులుగా తేలిన అల్ ఫలాహ్ వర్సిటీ డాక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేయగా.. తాజాగా యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేశారు. తక్షణమే తమ లోగోను తొలగించాలని ఏఐయూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇదివరకే ఆ వర్సిటీ వెబ్‌సైట్‌లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకుగానూ యూజీసీకి చెందిన నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ షోకాజు నోటీసులు పంపింది. అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కాలేజీలకు నాక్ నుంచి A రేటింగ్ వచ్చిందని పేర్కొనడాన్ని తప్పుబట్టింది. ఇంజినీరింగ్ కళాశాల 2013లో ‘ఏ’ గ్రేడ్ అందుకుందని.. అయితే ఈ గ్రేడ్ 2018 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉందని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
అల్ ఫలాహ్ వర్సిటీ గుర్తింపు రద్దు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



