Friday, November 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూబ్లీహిల్స్ బైపోల్..న‌వీన్ కుమార్ యాద‌వ్ విక్ట‌రీ

జూబ్లీహిల్స్ బైపోల్..న‌వీన్ కుమార్ యాద‌వ్ విక్ట‌రీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణ జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ ఘ‌న విజ‌యం సాధించారు. ప్ర‌త్య‌ర్థుల‌పై భారీ మెజార్టీతో గెలిచారు. 24,658 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 10 రౌండ్‌ల్లో కౌంటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగింది. మొద‌టి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. ప్ర‌తి రౌండ్‌లో ప్ర‌త్య‌ర్థుల‌పై స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త‌ను క‌న‌బ‌ర్చారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత రెండో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. అదే విధంగా బీజేపీ పోటీదారుడు లంక‌ల దీప‌క్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మ‌ర‌ణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్య‌మైన విష‌యం తెలిసిందే. ఈనెల 11న ఎన్నిక‌ల నిర్వ‌హించ‌గా 48.49 పోలింగ్ శాతం న‌మోదైంది. దేశవ్యాప్తంగా జ‌రిగిన బైపోల్ ఎన్నిక‌ల పోలింగ్ తో పోలిస్తే..అత్య‌ల్పంగా పోలింగ్ శాతం జూబ్లీహిల్స్ లో న‌మోదైంది. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం దాదాపు 4ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -