Friday, May 16, 2025
Homeఅంతర్జాతీయంశాంతి చర్చలకు హాజరైన రష్యా, ఉక్రెయిన్‌ బృందాలు

శాంతి చర్చలకు హాజరైన రష్యా, ఉక్రెయిన్‌ బృందాలు

- Advertisement -

అంకారా: ఇస్తాంబుల్‌లో జరగనున్న శాంతి చర్చలకు రష్యా, ఉక్రెయిన్‌ బృందాలు హాజరయ్యాయి. ప్రస్తుతం తాము చర్చలకు సిద్ధమేనని, సాధ్యమైన రాజీలకు కూడా సిద్ధంగా వున్నామని పుతిన్‌ సహాయకుడు వ్లాదిమిర్‌ మెదిన్‌స్కీ చెప్పారు. తాము వర్కింగ్‌ మూడ్‌లో వున్నామని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రతినిధి బృందంలో సంబంధిత ప్రభుత్వ విభాగాల సీనియర్‌ అధికారులు కూడా వున్నారని తెలిపారు. ఈ చర్చలకు అధ్యక్షుడు పుతిన్‌ హాజరు కాబోరని క్రెమ్లిన్‌ ఇప్పటికే ప్రకటించింది. కాగా, మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్‌ ప్రతినిధి బృందం టర్కీ రాజధాని అంకారా చేరుకుంది. తొలుత 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించకపోతే మాస్కోతో చర్చలు జరిపేది లేదని జెలెన్‌స్కీ పట్టుబట్టారు. కానీ ఈ చర్చలకు తమ మద్దతు వుంటుందని ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో జెలెన్‌స్కీ తన వైఖరి మార్చుకున్నారు. ఇస్తాంబుల్‌ చర్చలకు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -