Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు 

సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు 

- Advertisement -

– కొనసాగుతున్న డాక్యుమెంట్ల వెరిఫికేషన్
నవతెలంగాణ-వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఏసీబీ మహబూబ్నగర్ రేంజ్ డిఎస్పి సిహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయం లో అన్ని రకాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు కార్యాలయ లావాదేవీ రిజిస్టర్ లను పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడానికి ముందు డాక్యుమెంట్ రైటర్ల ను సంప్రదించి డాక్యుమెంటేషన్ చార్జీల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా కేంద్రంలో అవినీతి అక్రమాలు భారీగా చోటు చేసుకుంటున్నాయన్న పక్కా సమాచారం మేరకు మహబూబ్నగర్ రేంజ్ పరిధిలోని 10 మందికి పైగా ఏసీబీ అధికారులు మూడు వాహనాలలో వచ్చి సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంటేషన్ల పరిశీలన శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వాసనీయ సమాచారం. సోదాలపై ఏసీబీ రేంజ్ డీఎస్పీ బాలకృష్ణను వివరణ కోరగా సాధారణ తనిఖీల్లో భాగంగానే వనపర్తి లోను డాక్యుమెంటేషన్ల రిజిస్ట్రేషన్ ల వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -