Friday, November 14, 2025
E-PAPER
HomeNewsగోవిందరావుపేటలో జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్ సంబరాలు

గోవిందరావుపేటలో జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ గోవిందరావుపేట

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్  భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం163 జాతీయ రహదారిపై  బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా వెంకటకృష్ణ  మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్  భారీ మెజారిటీతో గెలవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే ప్రధాన కారణం అని, అలాగే మా మంత్రి సీతక్క  చరిష్మా కూడా నవీన్ యాదవ్  గెలుపులో తనదైన ముద్ర వేసిందని, అలాగే ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్  కూడా గడప, గడపకు ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు అని అన్నారు. ఇరవై రోజులకు పైగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పాగా వేసి గెలుపుకు ప్రధాన పాత్ర పోషించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అని అన్నారు. అలాగే దొరల ఘడిని బద్దలు కొట్టి, ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పిన శుభ సందర్భముగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం సంబరాల్లో మునిగిపోయాం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్ గార్లతో పాటుగా గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -