– 18న అచ్చంపేటలో ప్రారంభించనున్న సీఎం జీవో విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యూపీఏ ప్రభుత్వం 2006లో తీసుకొచ్చిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం ప్రకారం రాష్ట్రంలో హక్కు పత్రాలు పొందిన గిరిజన రైతుల ఆర్దిక, జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రజా ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని రూపకల్పన చేసింది. ఈ పథకానికి సంబంధించి గురువారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్ జీవో విడుదల చేశారు. 2006 సంవత్సరంలో వచ్చిన ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ హక్కు పత్రాలు పొంది ఉన్న 2.10 లక్షల మంది రైతులకు ఐదేండ్లలో ఆరు లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించేందుకు రూపకల్పన చేసిన ఈ పథకానికి రూ.12,600 కోట్ల కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకాన్ని ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏర్పాట్లను ఆర్థిక ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పర్యవేక్షిస్తున్నారు.
ఇందిర సౌర గిరి జల వికాసానికి రూ. 12,600 కోట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES