Saturday, May 17, 2025
Homeజాతీయంమెగా డీఎస్సీ గడువు పొడిగింపుపై స్పందించిన మంత్రి

మెగా డీఎస్సీ గడువు పొడిగింపుపై స్పందించిన మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: మెగా డీఎస్సీ ద్వారా కూటమి ప్ర‌భుత్వం 16, 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయ‌నుంది. ఇందుకు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ గురువారంతో ముగిసింది. జూన్ 6 నుంచి ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, ప్రిప‌రేష‌న్‌కు 90 రోజుల గ‌డువు ఇవ్వాల‌ని చాలా మంది అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ డిమాండ్‌పై ఐటీ, విద్య‌శాఖల మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ..గతేడాది డిసెంబర్‌లోనే మేము సిలబస్ ప్రకటించ‌డం జ‌రిగింది. ఏకంగా ఏడు నెల‌లు గ‌డువిచ్చాం అని ఆయ‌న‌ గుర్తు చేశారు. దీంతో మెగా డీఎస్సీ గ‌డువు పెంపున‌కు అవ‌కాశం లేద‌ని చెప్పకనే చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -