- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తిరుపతి ఐఐటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలోనే నేడు తిరుపతి ఐఐటీకి రూ.2,313 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో ఐఐటీ పరిధిలో పెండింగ్‌లో అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.
- Advertisement -