Saturday, May 17, 2025
Homeతాజా వార్తలుఢిల్లీలో ప‌డిపోయిన ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో ప‌డిపోయిన ఎయిర్ క్వాలిటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మ‌రోసారి ఢిల్లీలో గాలి నాణ్య‌త‌ ప‌డిపోయింది. ప‌లు రోజులుగా దేశ‌రాజ‌ధానిలో దుమ్ము, ధూళితో కూడిన వాయు కాలుష్యం పెరిగిపోయింద‌ని సెంట్ర‌ల్ పొలూష్య‌న్ బోర్డు పేర్కొంది.ఈ కార‌ణంగా ఇవాళ ఉద‌యం 7గంట‌ల‌కు AQI 301 ఉండ‌గా, త‌ర్వాత గంట గంట‌కు గాలి నాణ్య‌త ప‌డిపోతూ 301 నుంచి 400 అత్యంత పూర్ కేట‌గిరికి చేరుకుంద‌ని పొలూష్య‌న్ అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా గంటకు 30-40 కి.మీ వేగంతో వీచిన గాలులు పాలం, పరిసర ప్రాంతాలను తుడిచిపెట్టాయి, దీని వలన రాజస్థాన్ నుండి గణనీయమైన ధూళి వచ్చింద‌న IMD తెలిపింది. ఈ అకాల ఈదురు గాలుల‌కు మే నెలలో దేశ రాజధానిలో గాలి నాణ్యత అసాధారణంగా క్షీణించింద‌ని పేర్కొంది. ఢిల్లీవాసులు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. మ‌రోవైపు బీజేపీ పాల‌న‌పై ఆప్ నేత‌లు విమ‌ర్శ‌ల‌కు ఎక్కుపెట్టారు. మూడు నెల‌ల‌కే ఎన్నిక‌ల హామీల‌ను తుంగ‌లోతొక్కారని మండిప‌డ్డారు. రోజురోజుకు దేశ‌రాజ‌ధానిలో వాయు కాలుష్యం పెరుగుతున్న ఢిల్లీ సీఎం ఏ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలేద‌ని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -