నవతెలంగాణ-హైదరాబాద్: కారు బాంబు పేలుళ్లతో దేశరాజధాని ఢిల్లీ దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఎర్రకోట సమీపంలో మెట్రో గేట్ వద్ద భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 13మంది అమాయక జనాలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతాను కట్టుదిట్టం చేసింది. ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు అప్పగించింది. రంగంలోకి దిగిన ఎన్ఐఏ స్పెషల్ టీం దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి..పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. బాంబు పేలుళ్ల నేఫథ్యంలో ఎర్రకోట సందర్శనతో పాటు మెట్రో గేట్ కూడా అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తాజాగా ఎర్రకోట దగ్గర ఉన్న మెట్రో గెట్లను (2,3) పునరుద్ధరించారు. ఈమేరకు ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్(DMRC) అధికారులు వెల్లడించారు. దీంతో యథావిధిగా ప్రయాణికుల రాకపోకలు మొదలైయ్యాయి.
ఎర్రకోట దగ్గర మెట్రో సేవలు పునరుద్ధరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


