నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోటే బిక్షపతి, ముడుగుల ఉపేందర్ , మోటే నరసింహ, వడ్డెరి రాజు లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సమక్షంలో చేరారు.ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, మాజీ సింగల్ వెండో చైర్మన్ లు ఎడ్ల సత్తిరెడ్డి, బాల్గురి మధుసూదన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, మండల నాయకులు జక్కా రాఘవేందర్ రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, సింగిరెడ్డి నర్సిరెడ్డి, సుబ్బురి రమేష్, బుచ్చాల మహేందర్ లు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



