నవతెలంగాణ-కడ్తాల్: నిరుపేద కుటుంబాల కలలను నిజం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల స్థలాలకు ఆదివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. సాలార్ పూర్ గ్రామంలో ముద్వేంటి శ్యామల ఇల్లు స్థలానికి భూమిపూజ చేశారు. మాజీ సర్పంచ్ నేనావత్ శంకర్ నాయక్ స్వయంగా పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు శాశ్వత గృహం కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామీణ ప్రజలకు పెద్ద ఆశీర్వాదమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఇల్లు అందే వరకు తన వంతు కృషి కొనసాగిస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో శంకర్, శ్రీశైలం, శ్రీను, సిలారి, ఇక్బాల్, చెన్నయ్య, మహేష్‌తో పాటు ముద్వేంటి శ్యామల కుటుంబసభ్యులు, ఇతర లబ్ధిదారులు, గ్రామ పెద్దలు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.
సాలార్‌పూర్‌లో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



