Monday, November 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసౌదీ ప్రమాదం..మృతిచెందిన 16 మంది హైదరాబాదీల వివరాలు..

సౌదీ ప్రమాదం..మృతిచెందిన 16 మంది హైదరాబాదీల వివరాలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్‌-మదీనా మధ్య ముఫరహత్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సు.. డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 42 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 చిన్నారులు ఉన్నారు. కాగా, మరణించిన వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు. మల్లేపల్లిలోని బజార్‌ఘాట్‌కు చెందిన 16 మంది మృతిచెందారు.

వారిని రహీమున్నీసా, రహత్‌ బీ, షేహనాబ్‌ బేగం, గౌసియా బేగం, కదీర్‌ మహ్మద్‌, మహ్మద్‌ మౌలానా, షోయబ్‌ మహ్మద్‌, సోహైల్‌ మహ్మద్‌, మస్తాన్‌ మహ్మద్‌, పర్వీన్‌ బేగం, జకియా బేగం, షౌకత్‌ బేగం, ఫర్హీన్‌ బేగం, జహీన్‌ బేగం, మహ్మద్‌ మంజూర్‌, మహ్మద్‌ అలీగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. కాగా, ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం సెక్రటేరియట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. వివరాలకోసం 79979 59754, 99129 19545 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -