- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సీసీఐ విధానాలను వ్యతిరేకిస్తూ కాటన్ మిల్లర్లు నిరసనకు దిగారు. L1, L2 కేటగిరీలను ఎత్తివేయాలంటూ నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్ చేపట్టారు. దీంతో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. ఇప్పటికే ‘కపాస్’ యాప్‌లో స్లాట్ బుకింగ్, ఎకరాకు 7 క్వింటాళ్లే కొనుగోలు, తేమ 8-12% మించొద్దన్న నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. వానలు తగ్గడంతో తేమ సమస్య ఉండదనుకుంటే బంద్‌తో కొనుగోళ్లు ఆగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
- Advertisement -



