నవతెలంగాణ-హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదం తరహాలోనే సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్-మదీనా మధ్య ముఫరహత్ వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సు.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 42 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 చిన్నారులు ఉన్నారు. కాగా, మరణించిన వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు. మల్లేపల్లిలోని బజార్‌ఘాట్‌కు చెందిన 16 మంది మృతిచెందారు. తాజాగా ఈ ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీ మల్లిఖార్జున ఖర్గే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. ఆపద సమయంలో మృతుల కుటుంబాలకు తగిన విధంగా సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
సౌదీ బస్సు ప్రమాదంపై మల్లిఖార్జున ఖర్గే తీవ్ర విచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



