నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ప్రతిపక్షనేతగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్ ఎన్నికైయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాఘపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో.. ఎన్డేయే కూటమికి 202పైగా స్థానాలను కైవసం చేసుకుంది. మహాగఠ్‌బంధన్ 35 సీట్లను కైవసం చేసుకుంది. జన్‌సురాజ్ పార్టీ అభ్యర్థులు ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా విజయం సాధించలేదు. మొత్తం 238 స్థానాల్లో పోటీ చేసి అనేక చోట్ల ఆ పార్టీ అభ్యర్థలు డిపాజిట్ గల్లంతు అయ్యాయి.
243 స్థానాలకు గాను ఎన్డీఏ 202 స్థానాలను గెలుచుకుంది, బీజేపీ 89 స్థానాలను గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ-89, జెడి(యు)-85, ఎల్జేపీ(ఆర్వీ)-19, హెచ్ఏఎం(ఎస్)-5 సీట్లు, ఆర్ఎల్ఎం- 4 సీట్లను గెలుచుకున్నారు. మహాఘట్బంధన్: ఆర్జేడీ(25), ఐఎన్సీ(6)సీట్లు, సీపీఐ(ఎంఎల్)(ఎల్)-2 సీట్లు, సీపీఐ(ఎం): 1 సీటు ఐఐపీ 1 సీటును, ఏఐఎంఐఎం 5 సీట్లను గెలుచుకుంది.



