- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు అనాసాగరంవద్ద K కావేరి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సు ముందు, ఎడమవైపు భాగం పూర్తిగా దెబ్బతింది. ఆ బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా 8 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -



