నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లా ప్రత్యేక ట్రిబ్యునల్ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో బంగ్లాలో అల్లర్లు చెలరేగాయి. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హసీనా మద్దతుదారులు, అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారి ఆందోళనలతో బంగ్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అవామీలీగ్ పార్టీ రెండు రోజులపాటూ దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించింది. దీంతో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢాకా సహా ఇతర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు నిరసనకారులు ఢాకాలోని అనేక రహదారులను దిగ్బంధించారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. సౌండ్ గ్రెనేడ్‌లను, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. తాజా అల్లర్లలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
హసీనాకు మరణశిక్షతో భగ్గుమన్న బంగ్లాదేశ్.. ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -



