- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవానికి ఆయన హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ప్రధాని వెంట ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు. అనంతరం హిల్ వ్యూ ఆడిటోరియానికి మోడీ వెళ్లనున్నారు. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలు ఆవిష్కరించనున్నారు.
- Advertisement -


