Wednesday, November 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపరిస్థితులు మారుతున్నాయి.. మావోయిస్టులు ఆయుధాలు వీడి రండి : మల్లోజుల

పరిస్థితులు మారుతున్నాయి.. మావోయిస్టులు ఆయుధాలు వీడి రండి : మల్లోజుల

- Advertisement -

నవతెలంగాణ -హైద‌రాబాద్ : మావోయిస్టులు లొంగిపోవాల‌ని కోరుతున్న‌ట్లు మావోయిస్టు ద‌ళ మాజీ స‌భ్యుడు మ‌ల్లోజుల వేణుగోపాల్ పిల‌పునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న వ‌రుస ఎన్‌కౌంట‌ర్ల నేప‌థ్యంలో మ‌ల్లోజుల వీడియో సందేశం పంపారు. నిన్న‌టి ఎన్‌కౌంట‌ర్‌లో హిడ్మా స‌హా ఆరుగురు చ‌నిపోవ‌డం బాధాక‌రం అని మ‌ల్లోజుల పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోవాల‌ని కోరుతున్నాను అని చెప్పారు. మారిన ప‌రిస్థితుల దృష్ట్యా సాయుధ పోరాటం కొన‌సాగించ‌లేం.

ప్ర‌జ‌ల్లో చేరి పోరాటం చేయాల‌ని కోరుతున్నా. ప్ర‌జ‌ల్లో ఉండి రాజ్యాంగ‌బ‌ద్ధంగా పోరాటం సాగించాలి. ప‌రిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోంది. ఎన్‌కౌంట‌ర్ల‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్‌కౌంట‌ర్‌లో హిడ్మాతో పాటు ప‌లువురి ప్రాణాలు పోయాయి. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవ‌డం బాధ క‌లిగించింది అని మ‌ల్లోజుల పేర్కొన్నారు. లొంగిపోవాల‌నుకునే మావోయిస్టులు న‌న్ను సంప్ర‌దించొచ్చు. నా ఫోన్ నంబ‌ర్ 8856038533 కు సంప్ర‌దించ‌వ‌చ్చు అని మ‌ల్లోజుల సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -