నవతెలంగాణ ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, రైతుసంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్ష, కార్యదర్శి, చింతకాని మండలం పాతర్లపాడుకు మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య జరిగి నేటికీ 19 రోజులు అవుతున్నా దోషులను తేల్చటంలో పోలీసుశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు కాంగ్రెస్, బీజేపేతర అఖిలపక్షాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. సీపీఐ(ఎం)మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు అధ్యక్షతన ఖమ్మం నగరంలోని మంచికంటి భవన్ లో అఖిలపక్షాలతో రౌండ్‌టేబుల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి డి.సురేష్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీపీఐ(ఎంఎల్), వామపక్ష నేతలు తదితరులు పాల్గొన్నారు.
సామినేని హంతకులను పట్టుకోవడంలో పోలీసుశాఖ నిర్లక్ష్యాన్ని ఖండించిన అఖిలపక్షం (లైవ్)
- Advertisement -
- Advertisement -



