- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మరో ఆప్ఘనిస్థాన్ మంత్రి భారత్‌కు చేరుకున్నారు. ఆ దేశ పరిశ్రమల-వాణిజ్య శాఖ మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ దేశరాజధాని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగారు. ఆయనకు విదేశాంగ అధికారులు విమానాశ్రాయనికి వెళ్లి ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఆయన భారత్ లో ఆయన ఐదు రోజులు ఉంటారు. ఈ సందర్భంగా ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF) ను కూడా సందర్శించనున్నారు. అదేవిధంగా భారత వాణిజ్య అధికారులతో అజీజీ సమావేశం కానున్నారు. అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తాకి, ఈ ఏడాది అక్టోబర్‌లో ఆరు రోజులపాటు భారతలో పర్యటించి వెళ్లారు.
- Advertisement -



