Wednesday, November 19, 2025
E-PAPER
Homeఆటలుతొలి టెస్టులో టీమిండియా ఓటమి..భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

తొలి టెస్టులో టీమిండియా ఓటమి..భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలవ్వడంతో పిచ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లను తయారుచేయడం కొత్తేమీ కాదని, ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదేనని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా భువనేశ్వర్ మాట్లాడుతూ… “భారత్‌లో స్పిన్ పిచ్‌లు సిద్ధం చేయడం ఇప్పుడు మొదలైంది కాదు.

చాలా ఏళ్లుగా ఇదే కొనసాగుతోంది. జట్టు గెలుస్తున్నంత కాలం ఎవరూ దీనిపై ప్రశ్నించలేదు. ఇప్పుడు ఓటమి ఎదురవగానే విమర్శలు చేస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజం. గతంలోనూ భారత్ ఓడిపోయింది, ఇదేమీ మొదటి ఓటమి కాదు. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని అభిప్రాయపడ్డాడు. కోల్‌కతా పిచ్ పూర్తిగా టర్నింగ్ ట్రాక్ అని, అలాంటి పరిస్థితుల్లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్న జట్టు నిర్ణయాన్ని భువనేశ్వర్ సమర్థించాడు. “పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు నలుగురు స్పిన్నర్లతో ఆడటంలో తప్పేం లేదు. మ్యాచ్ జరిగిన తీరును బట్టి చూస్తే జట్టు కూర్పు సరైనదే” అని వివరించాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఓడిపోవడంతో పిచ్ తీరుపై మాజీ ఆటగాళ్లు, క్రీడా విశ్లేషకులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -