- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: విశాఖ సమీపంలో టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో విద్యుత్ లైన్ పనులు జరుగుతుండగా విద్యుత్ పోల్ పక్కకు ఒరిగింది. అదే సమయంలో ఆ మార్గంలో టాటానగర్ ఎక్స్‌ప్రెస్ వస్తుంది… లోకో పైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లపై స్తంభం పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో దాదాపు గంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే సాంకేతిక నిపుణులు ఆ మార్గంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు.
- Advertisement -



