Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనర్సింగ్‌ ఆఫీసర్ల మెరిట్‌ లిస్టు కోసం కోఠిలో ధర్నా

నర్సింగ్‌ ఆఫీసర్ల మెరిట్‌ లిస్టు కోసం కోఠిలో ధర్నా

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించిన మెరిట్‌ లిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని కోటిలో గల హెల్త్‌ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నర్సింగ్‌ ఆఫీసర్ల ప్రతినిధులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌తో జాయింట్‌ డైరెక్టర్‌ శ్వేత మోంగ చర్చలు జరిపారు. బోర్డు కార్యదర్శితో మాట్లాడి ఈ నెల 30లోపు ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆ తర్వాత వెరిఫికేషన్‌ పెడతామనీ, వెరిఫికేషన్‌ తర్వాత ఫైనల్‌ లిస్ట్‌ ఇస్తామని చెప్పారు. అంతకుముందు ధర్నానుద్దేశించి భూపాల్‌ మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖలో 2322 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్‌ ప్రాసెస్‌ గతేడాది ప్రారంభించి నేటికీ మెరిట్‌ లిస్టు విడుదల చేయకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల కోడ్‌ పేరుతో నవంబర్‌ 17 తర్వాత లిస్టు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఈ నెల 30 కల్లా మెరిట్‌ లిస్టు విడుదల చేయకపోతే డైరెక్టరేట్‌ ఎదుట డిసెంబర్‌ ఒకటి, రెండు తేదీల్లో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సింగ్‌ ఆఫీసర్లు సుష్మ శిరీష, రామేశ్వర్‌ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -