Thursday, November 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాలస్తీనాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడి.. 22 మంది మృతి

పాలస్తీనాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడి.. 22 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాలస్తీనాపై ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళం గాజా స్ట్రిప్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు సమాచారం. ఈ మేరకు గాజా డిఫెన్స్‌ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాలో 12 మంది, ఖాన్‌ యూనిస్ ప్రాంతంలో 10 మంది మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. అయితే, ఇజ్రాయెల్ మిలిటరీ వాదన మాత్రం మరోలా ఉంది. హమాస్‌ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే స్ట్రైక్స్‌ చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -