Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయం నేడు నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం...హాజరుకానున్న చంద్రబాబు

 నేడు నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం…హాజరుకానున్న చంద్రబాబు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఏపీ నాయకత్వానికి ఆహ్వానం అందింది. ఎన్డీఏ కూటమిలోని పక్షాల మధ్య బలమైన రాజకీయ సంబంధాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార స్ఫూర్తికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని హెలిప్యాడ్ నుంచి బయలుదేరతారు. ఉదయం 10:20 గంటలకు పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగే ప్రమాణ స్వీకార వేదికకు చేరుకుంటారు. కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నం 12:30 గంటలకు పాట్నా నుంచి తిరుగు ప్రయాణమై, మధ్యాహ్నం 2:55 గంటలకు తిరిగి ఉండవల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -