Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌కు హిడ్మా మృతదేహం తరలింపు..

ఛత్తీస్‌గఢ్‌కు హిడ్మా మృతదేహం తరలింపు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో బుధవారం రాత్రి హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం హిడ్మా, అతని భార్య రాజక్క మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.

ఈ నెల 18న మారేడుమిల్లి సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. 18, 19 తేదీల్లో రెండు దఫాలుగా జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇప్పటివరకు హిడ్మా సహా ఆరుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. మిగిలిన ఏడు మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతోంది.

హిడ్మా అంత్యక్రియలను ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువ్వర్తిలో (భద్రాచలంకు సమీపంలో ఉంటుంది) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, రంపచోడవరం ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతా దళాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -