Thursday, November 20, 2025
E-PAPER
Homeక్రైమ్ఖమ్మంలో దారుణం..భార్య గొంతు కోసి హతమార్చిన భర్త

ఖమ్మంలో దారుణం..భార్య గొంతు కోసి హతమార్చిన భర్త

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఖమ్మం నగరంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన గోగుల సాయివాణి(36), భర్త భాస్కర్‌కు మధ్య విభేదాలున్నాయి. దీంతో ఆమె కుమారుడు, కుమార్తెతో కలిసి ఖమ్మం నగరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివసిస్తోంది. ఓ ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తూ పిల్లల్ని ప్రయివేటు పాఠశాలలో చదివిస్తోంది.

మరోవైపు భార్యపై అనుమానం పెంచుకున్న భాస్కర్ గురువారం తెల్లవారుజామున నేరడ గ్రామం నుంచి వచ్చి ఆమె ఇంటి వద్ద కాపు కాశాడు. ఖమ్మం నగరం గట్టయ్య సెంటర్ సమీపంలోని నివాసంలో సాయివాణిపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకోబోయిన కుమార్తె హర్షవర్ధనికి కూడా గాయాలవడంతో ఆస్ప‌త్రికి తరలించారు. సంఘటనా స్థలిని ఖమ్మం రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -