నవతెలంగాణ – పట్నా: బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్.. నితీశ్ కుమార్ చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ అరుదైన రికార్డు నెలకొల్పారు. బీహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణం చేసిన నేతగా రికార్డు సృష్టించారు. ఇక ఇదే కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హ ప్రమాణం చేశారు. బీజేపీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
పదోసారి బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



