Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయం‘కాశ్మీర్‌ టైమ్స్‌’కార్యాల‌యంలో ఎస్‌ఐఎ సోదాలు

‘కాశ్మీర్‌ టైమ్స్‌’కార్యాల‌యంలో ఎస్‌ఐఎ సోదాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జమ్ముకాశ్మీర్‌ పోలీసుల ప్రత్యేక విభాగం జమ్ములోని ‘కాశ్మీర్‌ టైమ్స్‌’ వార్తాపత్రిక కార్యాలయంపై దాడులు చేపడుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఎ) బృందం గురువారం తెల్లవారుజామున పత్రిక కార్యాలయానికి చేరుకుని వివిధ విభాగాల్లో సోదాలు నిర్వహించింది. వార్తాపత్రికకు సంబంధించిన పత్రాలు మరియు డిజిటల్‌ పరికరాలను తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోదాలపై ఎస్‌ఐఎ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాశ్మీర్‌ టైమ్స్‌ను ప్రముఖ జర్నలిస్ట్‌ వేద్‌ భాసిన్‌ 1954లో స్థాపించారు. భాసిన్‌ కుమార్తె అనురాధ భాసిన్‌ ప్రస్తుతం పత్రిక ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -