- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరడంతో చిన్న గ్రామం మొత్తం విషాదంలోకి వెళ్లిపోయింది. భౌతికకాయాన్ని చూసి హిడ్మా తల్లి మాంజు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి తన కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించగా, గ్రామంలోని బంధువులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హిడ్మా అంత్యక్రియలకు గ్రామంలో ఏర్పాట్లు చేపట్టినట్లు సమాచారం. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భారీ యెత్తున తరలివస్తున్నారు.
- Advertisement -



