- Advertisement -
నవతెలంగాణ – నాంపల్లి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మునుగోడు మాజీ శాసనసభ్యులు దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చారు. నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ నాంపల్లి మాజీ చైర్మన్ నక్క చంద్రశేఖర్, డైరెక్టర్ బెల్లి సత్తయ్య, నాంపల్లి సంజీవ, గౌరు కిరణ్, గంజి సంజీవ, నేరెళ్ల సైదులు, నేరెళ్ల రవి, కోరె నగేష్, ఎదుల్ల యాదగిరి, కస్తూరి రాము తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



