Thursday, November 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌కు 5 జనరేషన్‌ ఎస్‌యు -57 స్టెల్త్‌ ఫైటర్‌: రష్యా

భారత్‌కు 5 జనరేషన్‌ ఎస్‌యు -57 స్టెల్త్‌ ఫైటర్‌: రష్యా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భారత్‌కు 5 జనరేషన్‌ ఎస్‌యు -57 స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వచ్చే నెల భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రష్యాలో ఉత్పత్తి చేయబడిన ఎస్‌యు-57 యుద్ధ విమానాలను సరఫరా చేయనున్నట్లు రక్షణ వ్యవస్థ రోస్టెక్‌ సిఇఒ సెర్గీ చెమ్‌జోవ్‌ తెలిపారు. అనంతరం దశల వారీగా ఉత్పత్తిని భారత్‌కు చేర్చాలన్న ప్రతిపాదన ఉన్నట్లు ప్రకటించారు. సింగిల్‌- ఇంజన్‌ స్టెల్త్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, ఎస్‌యు-57ను భారత్‌కు కూడా అందించవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇంజిన్లు, సెన్సార్లు, స్టెల్త్‌ మెటీరియల్స్‌ మరియు అన్నింటి తయారీతో పాటు 5 జనరేషన్‌ పర్యావరణ వ్యవస్థను భారత్‌కు అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని దుబాయ్ ఎయిర్‌ షో 2025 సందర్భంగా చెమజోవ్‌ మీడియాకి వెల్లడించిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య దశాబ్దాల నాటి భాగస్వామ్యాన్ని హైలెట్‌ చేస్తూ.. సాంకేతికతకు సంబంధించి భారత్‌ నుండి ఏదైనా డిమాండ్‌ అమోదయోగ్యమైనది అని చెమజోవ్‌ అన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ డిసెంబర్‌లో 23వ ఇండియా -రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఆయన చివరిసారిగా 2021 డిసెంబర్‌ 21న ఈ సమావేశం కోసం భారత్‌ను సందర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -