నవతెలంగాణ-హైదరాబాద్: ఒడిశాలో గోగూండాలు రెచ్చిపోయారు. భద్రక్ జిల్లాలో 17 పశువులను తీసుకువెళ్తున్న వ్యాన్‌కు నిప్పుపెట్టారు. భద్రక్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గెలాటువా సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.వివరాల ప్రకారం.. భద్రక్ జిల్లాలోని అగర్పడ నుండి 17 పశువులను వ్యాన్‌లో తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గోగూండాలు వ్యాన్‌ను వెంబడించారు. భయాందోళనకు గురైన డ్రైవర్, అతని సహాయకుడు వ్యాన్ వేగాన్ని పెంచారు. దీంతో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడటంతో 12 పశువులు అక్కడికక్కడే మరణించాయి. మిగిలిన జంతువులను రక్షించిన అనంతరం వ్యాన్‌ను గోగూండాలు తగలబెట్టారు. ఈ ఏడాది భద్రక్‌లో జరిగిన రెండవ ఘటన ఇది. ఆగస్టులో గో గూండాలు 12 ఆవులను తీసుకువెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని, జంతువులను విడిచిపెట్టిన అనంతరం వాహనానికి నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో అక్రమంగా ఆవు మాంసం తరలిస్తున్నారంటూ నాలుగు వాహనాలను అడ్డుకుని, డ్రైవర్లను పోలీసులకు అప్పగించారు.
ఒడిశాలో రెచ్చిపోయిన గోగూండాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



