- Advertisement -
రైతు సమస్యలపై అడ్డుకున్న రైతులు, బిఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ – రామారెడ్డి
సకాలంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీతక్కకు రైతులు, బి ఆర్ ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. గురువారం జిల్లా పర్యటనలో భాగంగా రామారెడ్డి మీదుగా వెళుతున్న సమయంలో వరి ధాన్యానికి వెంటనే బోనస్ చెల్లించాలని, రైతు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. సమస్యలపై మాట్లాడుతుంటే , సమయం తీసుకొని రావాలని, వేరే ఊరు వెళ్తున్నానని అన్నారు. మంత్రితో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.
- Advertisement -



