Friday, November 21, 2025
E-PAPER
Homeజాతీయంటీచర్ల వేధింపులతో టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య..

టీచర్ల వేధింపులతో టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బడిలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్కూల్‌ ప్రధానఉపాధ్యాయుడుతో సహా ముగ్గురు ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. పోలీసు విచారణకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. 16 ఏండ్ల శౌర్య పాటిల్‌ అనే విద్యార్థి ఢిల్లీలోని సెయింట్‌ కొలంబో బడిలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 18(మంగళవారం) ఢిల్లీలోని మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ల నుంచి అవమానాలు, వేధింపులు తట్టుకోలేక ఉసురు తీసుకుంటున్నానని, వారిపై చర్యలు తీసుకోవాలని తన సూసైడ్‌ నోట్‌లో విజ్ఞప్తి చేశాడు. ‘అమ్మా నన్ను క్షమించు. స్కూల్‌ సిబ్బంది వేధింపులకే నేనీ పని చేస్తున్నా. మరణించాక నా అవయవాలు ఏమైనా పనికి వస్తే వాటిని అవసరమైన వారికి అమర్చండి. అమ్మా.. నీ హృదయాన్ని చాలాసార్లు బాధపెట్టా. ఇప్పుడు ఆఖరిసారిగా చేస్తున్నా’ అంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -