Friday, November 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు..

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇరు సంస్థలు ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ తక్కువగా చెల్లిస్తున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అన్నపూర్ణ స్టూడియో లక్షా 92 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8 వేల100 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నట్లు గుర్తించారు. అన్నపూర్ణ స్టూడియో రూ. 11 లక్షల 52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తెలిపారు. రామానాయుడు స్టూడియో 68 వేల చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ… కేవలం 19 వందల చదరపు అడుగులకు ట్యాక్స్ పే చేస్తోందని.. రూ. 2 లక్షల 73 వేలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం 7 వేల 600  మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -