Friday, November 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకాప్30 సదస్సులో అగ్నిప్రమాదం..21 మందికి గాయాలు

కాప్30 సదస్సులో అగ్నిప్రమాదం..21 మందికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న కాప్30 వాతావరణ సదస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరుగుతున్న ఈ సదస్సు వేదికపై కీలకమైన ఒప్పందాలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి వేలాది మంది ప్రతినిధులను సురక్షితంగా బయటకు తరలించారు.

సదస్సు ముగింపునకు 24 గంటల కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ పెవిలియన్‌లో మంటలు చెలరేగినట్లు భద్రతా ఫుటేజీలో నమోదైంది. విద్యుత్ పరికరాల షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని, ఆరు నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఈ ఘటనలో 21 మంది గాయపడగా.. సదస్సుకు హాజరైన వేలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బ్రెజిలియన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే, వారు ఎవరనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. గాయపడినవారిలో 12 మంది ఇప్పటికే డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. అగ్నిప్రమాద సమయంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ కూడా ఇక్కడే ఉన్నారు. యూఎన్‌ భద్రతా రక్షణ అధికారులు వెంటనే స్పందించి గుటెర్రస్‌తో పాటు మిగిలినవారిని కూడా బయటకు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -