- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వరల్డ్ కప్ విజేత, భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన నవంబర్ 23 ఆదివారం నాడు బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. మొదట నవంబర్ 20న జరగనున్నట్లు వార్తలు వినిపించినా, పెళ్లి తేదీ కాస్త ముందుకు జరిగింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ధ్రువీకరించడమే కాకుండా, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి వివాహం మహారాష్ట్రలోని స్మృతి మంధాన స్వస్థలం సాంగ్లీలో జరగనుంది. వీరి వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయింది.
- Advertisement -



