నవతెలంగాణ – హైదరాబాద్ : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్ అయిన విషయం విదితమే. తొలి ఇన్నింగ్స్‌లో మూడు బంతులే ఆడిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో గాయం తీవ్రతరం కావడంతో ఆ తర్వాత బ్యాటింగ్‌కే రాలేదు. కానీ చివరి ప్రయత్నంగా గిల్ శుక్రవారం ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యాడు. నవంబర్ 22 (రేపటి) నుంచి టీమిండియా-సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. జట్టుతో పాటు ఇప్పటికే గువాహటి చేరుకున్న గిల్ ప్రాక్టీస్‌లో మాత్రం పాల్గొనలేకపోయాడు. తాజాగా ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరయ్యాడు. ఫలితం అనుకూలంగా రాకపోవడంతో జట్టు గిల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. దీంతో అతడు ముంబయికి బయలుదేరారు. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మరోసారి వైద్యులను సంప్రదించనున్నాడు. అయితే అతడిని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పంపే విషయమై ఇప్పటివరకు బిసిసిఐ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అనూహ్యంగా జట్టులోంచి వైదొలిగిన గిల్ స్థానంలో స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నారు. గిల్ గైర్హాజరీలో జట్టును ముందుండి నడిపించనున్నాడు. దీంతో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. వికెట్ కీపర్ కెప్టెన్‌గా పని చేసిన రెండో ఆటగాడిగా పంత్ నిలవనున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానం క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీదే. ధోనీ తర్వాత ఈ ఫీట్ అందుకున్న రెండో భారత కెప్టెన్, వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించనున్నాడు.
గిల్ అవుట్.. టీమిండియాకు కొత్త కెప్టెన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



