Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పది దాటినా ఆఫీసుకు రాని ఉద్యోగులు...

పది దాటినా ఆఫీసుకు రాని ఉద్యోగులు…

- Advertisement -

– షాద్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ తీరుపై ప్రజల మండిపాటు…
నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్ 
: ఉదయం 10 దాటిన సంబంధిత ఉద్యోగస్తులు ఆఫీసులకు రావడం లేదు. ప్రభుత్వ సేవల కోసం వస్తున్న ప్రజలు అధికారుల కోసం నిరీక్షించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. షాద్ నగర్ పట్టణంలోని షాద్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉదయం 10 దాటిన రిజిస్ట్రేషన్ అధికారితో పాటు సంబంధిత సిబ్బంది ఎవరు కూడా సమయపాలన పాటించకపోవడంతో కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా కనపడటం చూసి ప్రజలు నివ్వెర పోతున్నారు. సకలానికి ఉద్యోగానికి రాకుండా ఇలా కాలయాపన చేస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఉద్యోగస్తులు ఆలస్యంగా రావడం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఉదయం 10 దాటిన కనీసం కార్యాలయంలో జవాబు ఇచ్చేవారు కూడా కరువయ్యారని ఇలా ప్రభుత్వ ఉద్యోగాలను గాలికి వదిలేసి జీతాలు తీసుకుంటున్న ఉద్యోగస్తులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా సమయపాలన లేని సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగుల నిర్లక్ష్య తతంగంపై ఉన్నతాధికారులు దృష్టిచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…. గత నాలుగు రోజుల క్రితం పట్టణంలోనే ఐసిడిఎస్ కార్యాలయంలో సైతం 10:30 తర్వాత కూడా ఉద్యోగులు కార్యాలయానికి రాణి విషయం సైతం వెలుగు చూసింది. తాజాగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సైతం సేమ్ రిపీట్ అవ్వడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు సమయపాలన పాటించని సిబ్బంది అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -