Saturday, May 17, 2025
Homeజాతీయంఎందుకీ దాపరికం..!

ఎందుకీ దాపరికం..!

- Advertisement -

– ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలు ఎందుకు బహిర్గతం చేయటం లేదు
– మౌనంగా మోడీ
– క్యాబినెట్‌లో చర్చ జరగలేదు..
– పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం నో
– లీకులతోనే కాలక్షేపం
పహల్గాం దాడి ప్రతి భారతీయుడి గుండెల్లో అగ్గిని రగుల్చుతోంది. అయితే ఈ నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి, కాల్పుల విరమణ గురించి ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. అయితే… ఈ విషయంలో ఎందుకని మోడీ ప్రభుత్వం వాస్తవాలను బహిర్గతం చేయటంలేదన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది. ఇటీవల కేంద్ర క్యాబినెట్‌ భేటీ అయినప్పుడు ఆపరేషన్‌ సిందూర్‌ గురించిన వివరాలు ప్రకటిస్తుందనుకుంటే.. ఉత్తరప్రదేశ్‌లో సెమీ కండక్టర్ల పరిశ్రమకు ఆమోదం తెలిపింది. తాజాగా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు పెట్టాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌కు..అలాంటిదేమీ లేదనేలా లీకులిస్తోంది. నోరే విప్పవద్దని అమెరికా అధ్యక్షుడే ప్రధానికి ఏమైనా హుకుం జారీ చేశారా..? ఇంతకీ మోడీ మన్‌కీబాత్‌లో ఏముందనే చర్చ నడుస్తోంది.
న్యూఢిల్లీ:
భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు, ఆపరేషన్‌ సిందూర్‌పై ఎన్నో అనుమా నాలు, సందేహాలు ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నాయి. అయితే దీనిపై ప్రధాని మోడీ లైవ్‌ టెలికాస్ట్‌ ఇచ్చి.. పాక్‌ను ఏవిధంగా దెబ్బతీశా మో వివరించారు. ఆ తర్వాత వాట్‌నెక్ట్స్‌ అన్నది మాత్రం వీడని మిస్టరీగా మారింది. అంతకు ముందు అఖిలపక్షసమావేశానికి హాజరైన ప్రతిపక్షాలు కూడా దేశ భద్రత, రక్షణ అంశాలపై తమ సంపూర్ణ సహకారం ఉంటుందని మద్దతునిచ్చాయి. కాల్పుల విరమణ అంశం వెనుక ఎవరున్నారో గానీ.. నేనే చెప్పానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెరపైకి వచ్చారు. వాస్తవం ఏమిటో ఇప్పటికీ మిస్టరీగా మారింది. ఇప్పటికీ త్రివిధ దళాలతో ప్రధాని మోడీ సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నా రు. అంతేకాదు సరిహద్దుల్లో ఉన్న జవాన్లను కలిసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే పనిలో ప్రధాని , కేంద్రరక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బిజీగా ఉన్నారు. మరోవైపు ఈ కీలక అంశాల ను చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇందుకు కేంద్రం నిరాసక్తత కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సముఖంగా లేదని సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఏడాది జులైలో జరిగే వర్షాకాల సమావేశాల్లోనే ప్రతిప క్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పనుంది. పహల్గాం దాడి అనంతరం జరిగిన పరిణామాలు, కలసికట్టుగా తీసుకున్న నిర్ణయాలను చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ ఇటీవల ప్రధాని మోడీకి లేఖ రాశారు. ”ఐక్యత, సంఘీభావం అవసరమైన ఈ తరుణంలో, వీలైనంత త్వరగా ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయడం ముఖ్యమని విపక్షం భావిస్తోంది” అని రాహుల్‌ పేర్కొన్నా రు. వీరితో పాటు మరికొందరు విపక్ష పార్టీల ఎంపీలు సైతం ఇదే డిమాండ్‌ వినిపించారు. అయితే, విపక్షాల డిమాండ్‌ను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆపరే షన్‌ సిందూర్‌ తాత్కాలికంగానే నిలిచిందని, ఈ సమయంలో అనవసర చర్చలకు తావివ్వొ ద్దని ప్రతిపక్షాల ను దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే కేంద్రం కూడా దీనిపై సుముఖం గా లేనట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. జులైలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. అప్ప టిదాకా సైలెంట్‌గా ఉంటేనే అటు ట్రంప్‌ను సంతృప్తి పర్చవచ్చని మోడీ సర్కార్‌ భావిస్తున్నట్టు చర్చ నడుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -