నవతెలంగాణ-హైదరాబాద్: అంతర్జాతీయ అందాల పోటీలో మెక్సికో భామ విజయాన్ని అందుకున్నారు. థాయ్ లాండ్‌లో ఘనంగా నిర్వహించిన మిస్ యూనివర్స్ 2025 పోటీలో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ కిరీటాన్ని తనదిగా చేసుకున్నారు. గత ఏడాది విజేతగా నిలిచిన డెన్మార్క్ అందగత్తె విక్టోరియా కెజార్ హెల్విగ్ ఈసారి ఫాతిమా తలపై కిరీటం పెట్టి గౌరవించారు.
ఫస్ట్ రన్నరప్ : థాయ్ లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్
సెకండ్ రన్నరప్ : వెనెజువెలా అందగత్తె స్టిఫానీ అబాసలీ
భారత తరఫున పోటీలో పాల్గొన్న రాజస్థాన్‌కు చెందిన మణికా విశ్వకర్మ మంచి పోటీ ఇచ్చినా, టాప్ 12 దశను చేరుకోలేకపోయారు. స్విమ్‌సూట్ రౌండ్‌లో మెరిసి టాప్ 30 వరకూ రాగలిగినా, తుదిదశలకు చేరని కారణంగా ఈ సంవత్సరం భారత్ కిరీటం ఆశలు నెరవేరలేదు.



