- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ
నాగర్ కర్నూల్ జిల్లా అండర్ 14 ఖోఖో పోటీల్లో ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. శుక్రవారం జిల్లా అండర్ 14 ఖోఖో పోటీల్లో ద్వితీయ స్థానంలో విద్యార్థులను పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో కోచ్ లు శివకుమార్, మల్లికార్జున్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



