Friday, November 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం33 ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చివేసాం: రష్యా రక్షణ శాఖ

33 ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చివేసాం: రష్యా రక్షణ శాఖ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సుమారు 30కి పైగా ఉక్రెయిన్‌ డ్రోన్లను అడ్డుకుని, ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. క్రిమియా, నల్లసముద్రం సహా ఐదు రష్యన్‌ ప్రాంతాలపై గురువారం అర్థరాత్రి ఉక్రెయిన్‌ 33 డ్రోన్లను ప్రయోగించిందని ప్రకటించింది. సైన్యం వాటిని అడ్డుకుని, విజయవంతంగా ధ్వంసం చేసిందని వెల్లడించింది. డ్రోన్ల ప్రయోగంతో సుమారు ఎనిమిది విమానాశ్రయాల్లో కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపింది.
దక్షిణ రష్యాలోని క్రాస్నోడార్‌ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని అత్యవసర కేంద్రం తెలిపింది. డ్రోన్‌ దాడి కారణంగా పాఠశాలలు, కిండర్‌ గార్డెన్‌లలో తరగతులను నిలిపివేయబడినట్లు పేర్కొంది. రోస్టోవ్‌ ప్రాంతంలో ఏడు డ్రోన్లను కూల్చివేశామని, ఒక విద్యుత్‌ స్తంభం దెబ్బతిందని తెలిపింది. సుమారు 200కి పైగా నివాసాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని స్థానిక గవర్నర్‌ యూరి స్ల్యూసర్‌ టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -