నవతెలంగాణ – ముధోల్
జలసంచాయ్- జనభాగీదారీ అవార్డును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ ను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాన్ని ఎమ్మెల్యే అందజేశారు. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే డిఆర్డిఓ విజయలక్ష్మిని ఎమ్మెల్యే సన్మానించి, అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు రావడంలో అధికారుల కృషి విలువైనదని అన్నారు. మున్ముందు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ మరింత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కలెక్టర్ కోరారు. ఎమ్మెల్యే వెంట బిజేపి యువ నాయకులు పట్టే పురం సతీష్ రెడ్డి, వినోద్ రెడ్డి, తదితరులు ఉన్నారు.



